బ్రాయిలర్
లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్
శ్రీ120 శ్రీ210 శ్రీ220
చికెన్
పార్వతీపురం రూరల్: ఉపాధ్యాయులు శాసీ్త్రయ ఆలోచనా విధానాన్ని స్వయంగా నేర్చుకుని విద్యార్థులకు నేర్పించాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ మేరకు జిల్లాకేంద్రం పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమావేశ మందిరంలో మంగళవారం సైనన్స్ ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాబోధనను కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం చేయకుండా నిజ జీవిత ఉదాహరణలు, ప్రయోగాలు, ఆచరణాత్మక పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు కేవలం పరీక్షల కోసమే కాకుండా, నేర్చుకున్న అంశాలను సొంత మాటల్లో వివరించేలా ప్రోత్సహించాలన్నారు. విద్యావిధానాన్ని ’టీచింగ్’ నుంచి ’లెర్నింగ్’ వైపు మళ్లించాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థుల్లా తమ బోధనా పద్ధతులను మెరుగుపరుచుకుంటూ పరిశోధనల వైపు పయనించాలని, పీహెచ్‌డీ నమోదుకు ముందుకు రావాలని కోరారు. ప్రతి పాఠశాల విద్యార్థుల స్థాయికి తగినట్లు స్వయంగా సమర్థవంతమైన ’యాక్షన్ ప్లాన్’ రూపొందించి అమలు చేయాలన్నారు. ల్యాబ్ ప్రయోగాలను గదికే పరిమితం చేయకుండా పాఠశాల ఆవరణలో ప్రదర్శించాలని తెలిపారు. తరగతి గదులు, క్యాంపస్ శుభ్రతలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సచిన్ ఆర్చిత్ రహర్, జిల్లా విద్యాశాఖాధికారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రయోగాలకే పెద్దపీట
విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం
పెంపొందించాలి
సైన్స్ ఉపాధ్యాయులతో కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి


