రాష్ట్రస్థాయి పోటీలకు 15 మంది విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు 15 మంది విద్యార్థుల ఎంపిక

Nov 11 2026 3:45 AM | Updated on Nov 11 2026 3:45 AM

కొత్తవలస: జిల్లా కేంద్రంలో ఇటీవల స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పాఠశాల క్రీడాపోటీల్లో మండలంలోని అప్పన్నపాలెం గ్రామం సమీపంలో గల ఓపీ జిందాల్‌ స్కూల్‌ నుంచి 15 మంది విద్యార్ధులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ విశ్వనాథం మంగళవారం తెలిపారు. అండర్‌–14 విభాగంలో హ్యాండ్‌ బాల్‌ పోటీలకు డి.చాతుర్య, పి.జాహ్నవి, కరాటే పోటీలకు ఈ.దేవకీలత, సీహెచ్‌.తవ్విక, ఎస్‌.కార్తీక్‌, క్రికెట్‌ పోటీలకు కె.మోక్షజ్ఞ, బాస్కెట్‌బాల్‌ పోటీలకు డి.చాతుర్య, ఎల్‌.కుసుమలు, బాస్కెట్‌బాల్‌ పోటీలకు జి.పూర్ణసాయితేజలు ఎంపికై నట్లు తెలిపారు. అలాగే అండర్‌–17 విభాగంలో ఫుట్‌బాల్‌ పోటీలకు జి.ప్రణవ్‌సిద్దార్థ, జి.పార్థు, బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎ.యోగికార్తీక్‌ ఎంపికై నట్లు తెలిపారు.రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను పాఠశాల బోధనా సిబ్బంది తదితరులు అభినందించారు.

వలస కార్మికుడి మృతి

విశాఖపట్నం: విజయనగరం జిల్లాకు చెందిన ఉజ్జిరోతు చిన్న (45) అనే వలస కార్మికుడు మంగళవారం మృతి చెందాడు. దీనిపై నగరంలోని పీఎం పాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..ఉజ్జిరోతు చిన్న నగరానికి వలస వచ్చి పెదరుషికొండలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న చిన్నకు మద్యం తాగే అలవాటు ఉంది. గతంలో పలుమార్లు మద్యం మత్తులో కిందపడి గాయపడిన ఘటనలు ఉన్నాయి. ఈ నెల 9వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్న తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం రుషికొండ ఐటీ సెజ్‌ రోడ్డులోని ఎలిఫెంట్‌ రెస్టారెంట్‌ సమీపంలో మృతి చెంది ఉన్నాడని కుమారుడు ఈశ్వరరావుకు సమాచారం అందింది. దీంతో కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అధికంగా మద్యం తాగడం, అనారోగ్యం కారణంగా తండ్రి మృతి చెంది ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement