18న వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌ జిల్లాస్థాయి ప్రసంగ పోటీలు | - | Sakshi
Sakshi News home page

18న వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌ జిల్లాస్థాయి ప్రసంగ పోటీలు

Nov 11 2026 3:45 AM | Updated on Nov 11 2026 3:45 AM

● జిల్లా యువజన అధికారి ప్రేమ్‌ భరత్‌ కుమార్‌

విజయనగరం: యువతలో మార్పు తీసుకువచ్చే దిశగా వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌ పేరిట ఈనెల 18న విజయనగరం జిల్లాస్థాయి ప్రసంగ పోటీలను స్థానిక మహారాజా కళాశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా యువజన అధికారి ప్రేమ్‌ భరత్‌ కుమార్‌ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు, యువత జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో పోటీలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువభారత్‌ నిర్వహిస్తున్న వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌– 2027లో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘మాదకద్రవ్యాల రహిత యువత–వికసిత్‌ భారత్‌’ అనే అంశంపై 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల యువత పాల్గొనవచ్చని తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని, రాష్ట్రస్థాయిలో విజయం సాధించిన ముగ్గురికి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని తెలిపారు. జాతీయస్థాయి పోటీలు 2027 జనవరి 9, 10 తేదీల్లో ఢిల్లీలోని సంవిధాన్‌ హాల్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మహారాజా కళాశాల ప్రిన్సిపాల్‌ సాంబశివరావు, కళాశాల యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement