మంత్రికి దత్త గ్రామంలో ఉత్తచేయి..! | - | Sakshi
Sakshi News home page

మంత్రికి దత్త గ్రామంలో ఉత్తచేయి..!

Nov 10 2026 1:43 AM | Updated on Nov 10 2026 1:43 AM

● పెదమానాపురంలో వైఎస్సార్‌సీసీ అభ్యర్థి విజయం

దత్తిరాజేరు: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ దత్తత తీసుకున్న గజపతినగరం నియోజకవర్గంలోని దత్తిరాజేరు మండలం పెదమనాపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంపీటీసీ రౌతు రాజేశ్వరిని గ్రామస్తులు భారీ విజయంతో గెలిపించి మంత్రికి ఉత్త చేయి చూపించారు. శనివారం ప్రకటించిన ఫలితాలలో ఆమె టీడీపీ అభ్యర్థిపై 436 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడంతో మంత్రి దత్తత తీసుకున్న గ్రామాన్ని ఎంతలా అభివృద్ధి చేశారో ఇప్పటికై నా అర్థంచేసుకోవచ్చు. మంత్రి దత్తత గ్రామంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని ఓడించడానికి శత విధాలా ప్రయత్నించినా ఆమె గ్రామానికి చేసిన అభివృద్ధి ముందు మంత్రి పాచికలు పారలేదు. గతంతో ఆమె 2021లో ఇంగిలాపల్లి ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా, అనంతరం 2006–11 వరకు గ్రామ సర్పంచ్‌గా, 2021లో ఏకగ్రీవంగా జెడ్పీటీసీగా గెలిచి సేవలందించడంతో ఆమెను గ్రామస్తులు మరింత మెజారిటీతో ఈ సారి గెలిపించారు. ఆమె భర్త స్వర్గీయ జయప్రసాద్‌ నాయుడు ఆశయ సాధన కోసం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని సోమవారం సాక్షితో ఎంపీటీసీ రౌతు రాజేశ్వరి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement