● ముగిసిన ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్
పార్వతీపురం రూరల్: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దెందేరు జెడ్పీహెచ్ పాఠశాలలో ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ కరాటే పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో జరిగిన పోటీల్లో విజయాలు సాధించి, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. దీంతో త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ కరాటే పోటీలకు వీరు అర్హత సాధించారు. ఉమ్మడి జిల్లా కరాటే సంఘం అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం జిల్లా కరాటే అసోసియేషన్న్ టెక్నికల్ డైరెక్టర్ జి.గోపాల్, అధ్యక్షుడు ఎస్.ప్రభాకర్, కార్యదర్శి ఎస్.నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు షేక్ ఫరీద్, కోశాధికారి ఎస్.విద్యాసాగర్, సంయుక్త కార్యదర్శి బి.పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.


