ఆశలు గల్లంతు | - | Sakshi
Sakshi News home page

ఆశలు గల్లంతు

Nov 10 2026 1:31 AM | Updated on Nov 10 2026 1:31 AM

ఆశలు గల్లంతు

ఆ తల్లిదండ్రుల ఆశలు గల్లంతయ్యాయి. తాము పడిన కష్టం కుమారులు కష్టపడకూడదని ఉన్నత చదువులు చదివించుకుంటున్న వారిని పెద్ద కుమారుడు మనోజ్‌ బీచ్‌లో గల్లంతయ్యాడన్న వార్త విషాదంలో ముంచేసింది. రాజాం మండలం రామినాయుడువలసకు చెందిన జె.లక్ష్మణరావు, రాధ దంపతులు రాజాం పట్టణంలో స్థిరపడ్డారు. లక్ష్మణరావు రాజాంలో మెకానిక్‌గా విధులు నిర్వహిస్తూ కుమారులను చదివించుకుంటున్నారు. పెద్ద చదువులు చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడతాడనుకున్న కుమారుడు మనోజ్‌ మృతిచెందడంతో బోరున విలపిస్తున్నారు.

70 రోజుల్లో ఎనిమిది మంది మృతి

ఈ ప్రదేశంలో గత 70 రోజుల్లో 8 మంది మృతి చెందినట్లు మైరెన్‌ అధికారులు చెబుతున్నా రు. నాగావళి నది, సముద్రతీరం కలిసే ప్రాంతం (మఘ) అత్యంత ప్రమాదకరంగా మారింది. బీచ్‌ అందాలను చూసేందుకు వస్తూ సెల్ఫీ మోజులో మృత్యువాత పడడం ఆందోళకరంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement