బ్రాయిలర్
లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్
శ్రీ145 శ్రీ260 శ్రీ270
చికెన్
గరుగుబిల్లి: మండలంలోని ఉల్లిభద్రలో డా. వైఎస్సార్ ఉద్యానవన కళాశాలలో నిర్వహిస్తున్న కురు పాం నియోజకవర్గ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి శనివారం పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు విధానాన్ని, సిబ్బంది నిర్వహిస్తున్న విధులను వారు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు చేపడుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వం పాటించాలని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, సజావుగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన ఏర్పాట్లు, భద్రత చర్యలను కూడా పరిశీలించారు. ఓట్ల లెక్కింపును ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.


