బాణసంచా షాపుల వద్ద అవగాహన | - | Sakshi
Sakshi News home page

బాణసంచా షాపుల వద్ద అవగాహన

Nov 8 2026 10:36 AM | Updated on Nov 8 2026 10:36 AM

విజయనగరం టౌన్‌: బాణసంచా షాపుల వద్ద జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పివిఎస్‌.రాజేష్‌ ఆధ్వర్యంలో ఏడీఎఫ్‌ఓ వి.సోమేశ్వరరావుతో పాటూ సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. దుకాణాల వద్ద ఫైర్‌ ఇంజన్‌లతో పాటూ సిబ్బందిని నియమించారు. షాపుల వద్ద కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలకు టపాసులు కాల్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, కరపత్రాలను అందజేశారు. అదేవిధంగా షాపుల వద్ద ప్రమాదాలు సంభవించేటప్పుడు ఉండాల్సిన ఇసుక, నీటితో పాటూ వివిధ రకాల అగ్నినిరోధక యంత్రాలను అందుబాటులో ఉంచారు. అదేవిధంగా బాణాసంచా కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తయారుచేసిన లఘుచిత్రాన్ని కలెక్టర్‌ సమక్షంలో శనివారం ఆవిష్కరించినట్లు ఫైర్‌ అధికారి రాజేష్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఫైర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement