పల్లె పోరులో హోరాహోరీ! | - | Sakshi
Sakshi News home page

పల్లె పోరులో హోరాహోరీ!

Nov 8 2026 10:30 AM | Updated on Nov 8 2026 10:30 AM

విజయనగరం గంటస్తంభం:

కేవలం రెండున్నరేళ్లలోనే చంద్రబాబు పాలనపై జనం తిరుగుబాటు ప్రకటించారు. పరిషత్‌ ఎన్నికల్లో ఓటుతో తమ నిరసన తెలిపారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు తెర తీసినా.. దౌర్జన్యాలకు తెగించినా.. పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున నిలబడ్డారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా రిగ్గింగుకు తెర తీసిన విషయం విదితమే.

ఎన్నికలను ఏకపక్షంగా మార్చేస్తామంటూ బహిరంగంగానే ఆ పార్టీ నాయకులు ప్రకటనలు గుప్పించారు. ఎన్ని అక్రమాలకు తెర తీసినా.. కుట్రలకు పాల్పడినా ప్రజల మద్దతుతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పలు చోట్ల జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కై వసం చేసుకున్నారు. ప్రధానంగా చీపురుపల్లిలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ తన పట్టునిలుపుకున్నారు. గుర్ల, గరివిడితో పాటు గజపతినగరం, నెల్లిమర్ల జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. అలాగే, పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, మక్కువ, పార్వతీపురం జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. సీతంపేట, మక్కువ, గుర్ల ఎంపీపీ స్థానాలు కూడా వైఎస్సార్‌సీపీ ఖాతాలో పడ్డాయి. ఈ నెల 5న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును శనివారం చేపట్టారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌, అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు చేపట్టారు. అర్ధరాత్రి వరకూ కౌంటింగ్‌ కొనసాగింది. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

రెండున్నరేళ్లకే చంద్రబాబు పాలనపై ఓటుతో జనం తిరుగుబాటు

ఉమ్మడి విజయనగరం జిల్లాలో

వైఎస్సార్‌సీపీ 9 జెడ్పీటీసీ స్థానాలు

కై వసం

కళా కోడలిపై బొత్స కోడలు విజయం

రామభద్రపురంలో కుమార్తైపె తల్లి విజయం

గట్టిపోటీ ఇచ్చిన వైఎస్సార్‌సీపీ

ఫలితాల్లోనూ పార్టీల మధ్య

ఉత్కంఠభరిత పోటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement