న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2026
గుర్ల జెడ్పీటీసీగా
సంగంరెడ్డి వెంకటలక్ష్మి
గుర్ల: మండలంలోని జెడ్పీటీసీ ఎన్నికలు హోరాహోరీగా సాగా యి. ప్రతి బూత్ లో నువ్వా.. నేనా? అన్నట్లుగా ఓట్లు రావడంతో కౌంటింగ్ కేంద్రంలో ఉత్కంఠ నెలకొంది. తుది పోరులో జెడ్పీటీసీ అభ్యర్థి సంగం రెడ్డి వెంకటలక్ష్మి 251 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది.
గజపతినగరంలో
సూర్యకళదే విజయం
గజపతినగరం /గజపతినగరం రూరల్: గజపతినగరం వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి మండల సూర్యకళ సమీప బీజేపీ అభ్యర్థి రెడ్డి పావనిపై 1848 ఓట్ల మెజారీటీతో విజయం సాధించారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, పురిటి పెంట మాజీ వైస్ సర్పంచ్ మండల సురేష్ సతీమణి సూర్యకళ మొదటి ఐదు రౌండ్లలో1848 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో గజపతినగరం, పురిటిపెంటతో పాటు మండల వాసులు సంబరాలు చేసుకున్నారు.


