బొబ్బిలి: పట్టణంలోని ప్రభాకర్ స్కూల్లో ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో తెర్లాం మండలం నందిగాం ఎంపీటీసీ సెగ్మెంటు లెక్కింపుపై కూటమి నాయకులు హైడ్రామా నడిపించారు. అక్కడి వైఎస్సార్ సీపీ అభ్యర్థి గంట లలిత 23 ఓట్లతో గెలిచారు. కానీ కూటమి నాయకులు జీర్ణించుకోలేక రీకౌంటింగ్‌కు ప్రతిపాదించారు. ఓట్లలో లెక్క సరిపోయినా పదేపదే ఆర్వో ఎం.హరికృష్ణంనాయుడుపై ఒత్తిడి తెచ్చారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, జెడ్పీటీసీ అభ్యర్థి వేణుగోపాలనాయుడు ఎన్నికల అధికారి, ఆర్డీఓ జేవీవీఎస్ రామమోహనరావుకు ఫిర్యాదు చేశారు.
వాస్తవానికి పదిలోపు ఓట్ల తేడా అయితేనే రీకౌంటింగ్‌కు అడుగుతారని, ఇక్కడ 23 ఓట్ల తేడా ఉన్నా రీకౌంటింగ్‌కు పదేపదే ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయన వెంటనే తెర్లాం మండల కౌంటింగ్ విభాగానికి వెళ్లి ఆర్వోకు నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు అయిపోతే వెంటనే ఫలితాన్ని ప్రకటించాలని ఆదేశించారు. దీంతో ఆయన ఫలితం ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేశారు.
ఆర్డీఓకు ఫిర్యాదు
చేసిన శంబంగి
వేణుగోపాల
నాయుడు
చివరకు గెలిచిన అభ్యర్థికి
ధ్రువీకరణ పత్రం అందజేత


