బ్యానర్‌... | - | Sakshi
Sakshi News home page

బ్యానర్‌...

Nov 1 2026 12:39 AM | Updated on Nov 1 2026 12:39 AM

● విద్యుత్‌ చార్జీల మోత

విద్యుత్‌ చార్జీలు గతంలో కంటే భారీగా పెరిగాయి. సాధారణ కుటుంబాలకు రూ.130 నుంచి రూ.150లు వచ్చే విద్యుత్‌ బిల్లు ఇప్పుడు రెట్టింపయింది. సర్‌చార్జీల పేరుతో అదనపు వసూళ్లు చేస్తుండడంతో విద్యుత్‌చార్జీలు కట్టలేక పట్టణాల్లో నివాసం ఉంటున్న కార్మికులు, రోజువారీ కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు లైట్లు, ఒక ఫ్యాన్‌ వినియోగిస్తే నెలకు రూ.350లు దాటి విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు. పన్నులు, విద్యుత్‌చార్జీల రూపంలో దోపిడీపై పట్టణవాసులు మండిపడుతున్నారు.

రాజాం:

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణ ప్రజలపై పన్నుల భారం అమాంతం పెరిగింది. ఇళ్లు, ఖాళీ స్థలాలకు పన్నుల వడ్డింపుతో పట్టణవాసుల జేబులకు చిల్లుపడుతోంది. మరోవైపు రెండున్నరేళ్లుగా నగరం, పట్టణాల్లో కనీస సదుపాయాల కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం నటిస్తోంది. గతంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇచ్చేది. క్యాపిటల్‌ ఆధారిత చెల్లింపులు కట్టడిచేసేది. ఫలితంగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఇంటిపన్ను వసూళ్లు అంతంత మాత్రంగానే ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా ఏటా 15 శాతం మేర ఇంటిపన్ను వసూళ్లు అధికమైంది.

క్యాపిటల్‌ ఆధారంగా..

ఏటా పట్టణాల్లో ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి విలువను నిర్థారిస్తున్నారు. చదరపు అడుగులు ఆధారంగా మున్సిపాల్టీలో 0.20 శాతం, కార్పొరేషన్లులో 0.50 శాతం పన్ను నిర్ధారిస్తున్నారు. 2021–23 మధ్య కాలంలో రాజాం మున్సిపాల్టీలో 375 చదరపు అడుగులు ఉండే ఖాళీ స్థలానికి రూ.4 లక్షలు మార్కెట్‌ విలువ ఉండేది. ఇప్పుడు ఆ ధర రూ.8 లక్షలకు చేరింది. ఈ క్యాపిటల్‌ ఆధారంగా గతంలో ఈ స్థలానికి చెల్లించే రూ.800లు పన్నును ఇప్పుడు రూ.1600లు చెల్లించాల్సి వస్తోంది. ఇలా ఖాళీ స్థలాలకే కాకుండా ఇంటికి సైతం పన్ను చెల్లింపు ఏటా గతంలో చెల్లించినదానికంటే 15 శాతం పెంచుతూ వస్తున్నారు. మరో వైపు ఇంటి నిర్మాణాలు సక్రమంగా లేవని, క్రమబద్ధీకరించుకోవాలని, కుళాయిలకు పర్మిషన్‌లేదనే షాకులతో అదనపు వసూళ్లు అధికమయ్యాయి. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఇంటిపన్నుభారం ఉండదనే హామీని గాలికొదిలేసింది. పట్టణ ప్రజలపై పన్నుల భారం వేస్తోంది. విధిలేక అప్పులుచేసి పన్నుచెల్లిస్తున్నారు.

ఏటా పన్ను పెంపు

మున్సిపాల్టీలో ఆస్తులు విలువ గతంలో కంటే భారీగా పెంచేశారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా ఇంటిపన్ను, ఖాళీ స్థలాలకు పన్నులు వసూలు చేస్తున్నారు. ఖాళీ స్థలాలకు భారీగా పన్నులు వసూలు చేయడం దారుణం. ఈ స్థాయిలో పన్నుల భారం వేసిన ప్రభుత్వాన్ని నేను చూడలేదు. పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఆ స్థాయిలో వార్డుల్లో మౌలిక వసతులు కల్పించడంలేదు.

– బి.వెంకటరమణ, రాజాం

నిబంధనల ప్రకారమే...

ఇంటి పన్నులు, ఖాళీ స్థలాలకు పన్నులు చెల్లింపు కార్యక్రమం ప్రభుత్వ నిబంధనలు ప్రకారమే జరుగుతోంది. ఏటా మున్సిపాల్టీలో 0.15 శాతం పెరుగుదల ఉంటుంది. క్యాపిటల్‌ విలువ ఆధారంగా ఈ వసూళ్లు జరుగుతున్నాయి. – ఎ.రామచంద్రరావు,

మున్సిపల్‌ కమిషనర్‌, రాజాం

గతంలో కంటే ఎక్కువ

నేను రాజాం మున్సిపాల్టీ ఆదర్శనగర్‌లో ఉంటున్నాను. గతంలో కంటే ఇప్పుడు ఇంటిపన్ను బాగా పెరిగిపోయింది. గతంలో రూ.5 వేలు ఇంటిపన్ను కడితే ఇప్పుడు రూ.7 వేలు కట్టాల్సి వస్తుంది. సకాలంలో చెల్లించకుంటే కుళాయి ఆపేస్తున్నారు. ఇంట్లో ఎవరైనా పింఛన్‌ వచ్చినవారు ఉంటే వాళ్ల డబ్బులు జమచేస్తున్నారు. ఇంటిపన్ను చెల్లింపులు సామాన్యునికి భారంగా మారాయి. మరో వైపు ఏ వార్డులో చూసినా అభివృద్ధి లేదు. ప్రభుత్వం నుంచి నగదు సంక్షేమ పథకాలు అందడంలేదు. ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. – కె.ఉమాశంకర్‌, రాజాం

ఇచ్చిన మాట తప్పిన ‘కూటమి’

ఆస్తి విలువ ఆధారంగా మున్సిపాల్టీలో

0.20 శాతం.. కార్పొరేషన్లులో 0.50 శాతం మేర పన్ను వసూళ్లు

గతంలో కంటే రెట్టింపు వడ్డింపు

కనీస వసతులు కల్పించని వైనం

ఖాళీ స్థలాలపై భారీగా పన్ను

ఇంటిపన్నుతో పాటు విద్యుత్‌ చార్జీల

పెంపు

ఆవేదనలో నగర, పట్టణ ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement