ఓటర్లకు ప్రలోభాల ఎర! | - | Sakshi
Sakshi News home page

ఓటర్లకు ప్రలోభాల ఎర!

Nov 1 2026 12:39 AM | Updated on Nov 1 2026 12:39 AM

విజయనగరం: మున్సిపల్‌ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కానుంది. శుక్రవారం సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడగా.. అదే రోజు రాత్రి నుంచి ప్రలోభాల పర్వం ప్రారంభమైంది. నోట్ల పాములు కట్టలు తెంచుకున్నాయి. ఓటుకు వాళ్లు రూ.500 ఇస్తే.. మేం రూ.వెయ్యి ఇస్తాం.. మీ ఇంటిలోని ఓట్లన్నీ మాకే వేయాలంటూ బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారు. విజయనగరం కార్పొరేషన్‌తో పాటు బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీల పరిధిలో డబ్బుల పంపిణీ సాగుతున్నట్టు సమాచారం. అధికార బలంతో అక్రమంగా డబ్బు సంపాదించినవారు ఇంటింటికీ డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు మద్యం పంపిణీ కూడా సాగుతోంది. డివిజన్‌, వార్డుల్లో ఉన్న మొత్తం ఓట్లలో 50 నుంచి 60 శాతం ఓట్లు దక్కితే విజయం సాధించగలమనే ప్రణాళికలు రూపొందించుకుని అందుకు తగ్గట్టుగానే.. పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరికొన్నిచోట్ల మేయర్‌/చైర్మన్‌ల ఓట్ల కోసం వేరుగా... కార్పొరేటర్‌/కౌన్సిలర్‌ అభ్యర్థులకు వేర్వేరుగా రూ.500 చొప్పున ఇచ్చేలా ముందే ఓటర్లతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలిసింది.

సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు

సమయం లేదు మిత్రమా.. ఇంటింటి ప్రచారాల కంటే ఆత్మీయ సమావేశాలవల్లే ఓట్లు పడ తాయని అభ్యర్థులకు ప్రధాన రాజకీయ పార్టీలు దిశానిర్దేశం చేయడంతో ప్రచార పర్వం ముగిసిన తరువాత ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మున్సిపల్‌ ఎన్నికలకు మొదటి నుంచే తక్కువ సమయం ఉండడం, దీనికి తోడు అర్నబ్‌ తుఫాన్‌ వల్ల ప్రచారానికి రెండు రోజులు ఆటంకం ఏర్పడడంతో నాయకుల్లో ఆందోళన పెరిగింది. ఈ సమయంలో ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించడం కంటే సామాజికవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వార్డుల వారీగా ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు మైనార్టీలతో ప్రధానంగా సమావేశాలు నిర్వహించారు. ముఖ్యంగా బీసీల్లో ఉన్న అన్ని ప్రధాన ఉపకులాలు, ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేశారు.

కట్టలు తెంచుకున్న నోట్ల పాములు

వారు రూ.500 ఇస్తే... మేం రూ.1000 ఇస్తామంటూ ఆఫర్లు

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు

నేడు మున్సిపల్‌ ఎన్నికల ఓటింగ్‌

దూర ప్రాంతాల నుంచి రప్పించేలా..

విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీలకు చెందిన ఓటర్లు కొందరు ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ తదితర దూర ప్రాంతాల్లో ఉన్నారు. వారందరికీ అభ్యర్థులే నేరుగా ఫోన్లు చేసి పోలింగ్‌కు రావాలని కోరుతున్నారు. ఖర్చులకు భయపడొద్దని.. రైలు, బస్సు టిక్కెట్లకు ఎంతవుతుందో చెబితే ముందే ఫోన్‌పే ద్వారా పంపిస్తున్నారు. వీరిని రప్పించేందుకు అభ్యర్థులు ప్రత్యేకంగా కొందరికి బాధ్యత అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement