విజయనగరం టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ (పరిపాలన)గా ఎ.పద్మలత శనివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆమె ఎస్పీ ఎ.ఆర్.దామోదర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పద్మలత 1998లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరారు. 2010లో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌గానూ, 2020లో డీఎస్పీగా, 2026లో అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతులు పొందారు. గతంలో ఆమె రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాలో వివిధ హోదాల్లో, వివిధ పోలీస్ స్టేషన్‌లో పనిచేసి గుర్తింపు పొందారు.
3న పైడితల్లి తెప్పోత్సవం
విజయనగరం (కల్చరల్) క్రైమ్: పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం ఈ నెల 3న జరగనుందని ఆలయ ఈఓ శిరీష శనివారం తెలిపారు. తెప్పోత్సవ ట్రయల్ రన్ సోమవారం జరుగుతుందన్నారు. తెప్పోత్సవం నిర్వహించే పెద్ద చెరువును అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. కార్యక్రమంలో దేవదాయశాఖ సిబ్బంది రమేష్, ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు, వనంగుడి అధికారులు, పూజారులు కృష్ణ, రాజేష్, సాయి, తదితరలు పాల్గొన్నారు.
పోలీస్ అమరవీరులకు నివాళి
విజయనగరం టౌన్: పోలీస్ అమరవీరులకు నివాళులర్పిస్తూ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి స్మృతివనంలోని అమరవీరుల స్థూపం వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఓపెన్ హౌస్, రక్తదాన శిబిరం, మెగా మెడికల్ క్యాంప్, సమైక్యత పరుగు, క్యాండిల్ ర్యాలీ నిర్వహించి విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు నివాళులర్పించామని ఎస్పీ దామోదర్ తెలిపారు. ర్యాలీలో ఏఆర్ అదనపు ఎస్పీ పి.కిరణ్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ ఇ.కోటిరెడ్డి, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు ఎన్.గోపాలనాయుడు, ఆర్.రమేష్‌కుమార్, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.


