పోలింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయాలి

Oct 30 2026 7:36 AM | Updated on Oct 30 2026 7:36 AM

● జెడ్పీ సీఈఓ పి.కిరణ్‌కుమార్‌

డెంకాడ: ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌ ప్రక్రియను ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ పి.కిరణ్‌కుమార్‌ అన్నారు. మండల పరిషత్‌, వెలుగు కార్యాలయాల్లో ఎన్నికల నిర్వహణపై పీఓ, ఏపీఓలకు గురువారం శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ వారికి అప్పజెప్పిన బాధ్యతలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. సమస్య ఉత్పన్నమైతే వాటికి చాలా జాగ్రత్తగా, నిబంధనలు ప్రకారం పరిష్కరించాలన్నారు. ఎన్నికల సిబ్బంది జాబితాను సీఈవో పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దేవానంద్‌, జీఎస్‌వీస్‌ మండల అధికారి కె.రాజ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మడ్డువలసకు వరదపోటు

● 60వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో

● 8 గేట్లు ఎత్తివేత

వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు గురువారం వరద తాకిడి పెరిగింది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 60 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 63.59 మీటర్లు నమోదైంది. దీంతో ప్రాజెక్టు వద్ద ఎమినిది గేట్లు ఎత్తివేసి 60వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నట్టు డీఈ పి.అర్జున్‌ తెలిపారు. ఇప్పటికే కొప్పర, కొండచాకరాపల్లి, గీతనాపల్లి గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.

నేటితో ప్రచారానికి తెర

విజయనగరం అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచార గడువు ముగియనుందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. ప్రచార గడువు ముగిసిన అనంతరం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గడువు ముగిసిన తర్వాత మైకులు వినియోగించడం, బహిరంగ సభలు నిర్వహించడం, ర్యాలీలు, ఊరేగింపులు చేపట్టడం సహా ఎలాంటి ప్రచార కార్యక్రమాలకూ అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల శిక్షణకు డుమ్మా కొట్టినవారికి షోకాజ్‌ నోటీసులు

విజయనగరం అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల రెండువితల శిక్షణకు సహేతుకమైన కారణం లేకుండా గైర్హాజరైన ఏడుగురు సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి గురువారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం వారిని ఎందుకు సస్పెండ్‌ చేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎన్నికల విధులను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కలెక్టర్‌ సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement