● మంత్రివర్యా.. ఇదేం పాలన..? | - | Sakshi
Sakshi News home page

● మంత్రివర్యా.. ఇదేం పాలన..?

Oct 30 2026 7:36 AM | Updated on Oct 30 2026 7:36 AM

వర్షం కురిస్తే కొండ వరద కాలనీను చుట్టుముడుతోంది.. ఇళ్లను ముంచెత్తుతోంది... రక్షణగోడ నిర్మించాలని విన్నవించినా పట్టించుకో లేదు.. విద్యుత్‌ లో ఓల్టేజీ సమస్య పరిష్కరించేవారే కరువయ్యారు.. తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదు.. అంగన్‌వాడీ భవనాన్ని అసంపూర్తిగా వదిలేశారు.. మంత్రి వర్యా.. ఇదేం పాలన అంటూ బొండపల్లి మండలం అంబటివలస ఎస్సీ కాలనీ వాసులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను నిలదీశారు. స్థానిక ఎన్నికల ప్రచారానికి గురువారం వెళ్లిన మంత్రిని చుట్టుముట్టి సమస్యలు ఏకరువుపెట్టారు. పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. దీనిపై ఏం సమాధానం చెప్పాలో తెలియక ఎన్నికల తర్వాత చూద్దామంటూ మంత్రి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. – బొండపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement