ప్రజాసంక్షేమమే వైఎస్సార్‌సీపీ ధ్యేయమని, స్థానిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి పార్టీ అభ్యర్థులను విజేతలుగా నిలపాలని ఎమ్మెల్సీ పీవీవీ సూర్యనారాయణరాజు (సురేష్ బాబు) ఓటర్లను అభ్యర్థించారు. నెల్లిమర్ల నగర
పంచాయతీ వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి సముద్రపు రామారావు, 10, 11వ వార్డు అభ్యర్థులు కె.హరీష్, బూర సుజాత తరఫున పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త గదల సన్యాసినాయుడుతో కలిసి గురువారం ఇంటింటి ప్రచారం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఓటుతో నాందిపలకాలని కోరారు. – నెల్లిమర్ల


