జెడ్పీటీసీ బరిలో 103 మంది | - | Sakshi
Sakshi News home page

జెడ్పీటీసీ బరిలో 103 మంది

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

విజయనగరం రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఉన్న 27 జెడ్పీటీసీ, 449 ఎంపీటీసీ స్థానాలకు వచ్చేనెల మూడున జరగనున్న ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 258, ఎంపీటీసీ స్థానాలకు 2,577 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 25న నామినేషన్ల పరిశీలనలో జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి నాలుగు, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 66 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సోమవారం నిర్వహించిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో 151 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వివిధ పార్టీల నుంచి 103 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

జెడ్పీటీసీ స్థానాలకు పార్టీలవారీగా బరిలో నిలిచిన అభ్యర్థులు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు 27 జెడ్పీటీసీ స్థానాల్లోనూ బరిలో నిలవగా టీడీపీ అభ్యర్థులు 22 చోట్ల, ఇందిరా కాంగ్రెస్‌ పార్టీ నుంచి వేపాడ, వంగర, రాజాం, గంట్యాడ, బొండపల్లి జెడ్పీటీసీ స్థానాలు మినహా మిగతా 21 మండలాల్లో పోటీలో నిలిచారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులు 13 స్థానాలు మినహా, మిగతా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు. జనసేన పార్టీ డెంకాడ, గుర్ల, జామి, నెల్లిమర్ల, పూసపాటిరేగ జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేస్తుండగా, బీజేపీ గజపతినగరం, సీపీఐ, ఎస్‌ఎస్పీ అభ్యర్థి పూసపాటిరేగ జెడ్పీటీసీ స్థానానికి పోటీ పడుతున్నాయి. అలాగే, బీఎస్పీ అభ్యర్థులు జామి, కొత్తవలస జెడ్పీటీసీ స్థానాలకు బరిలో నిలిచారు.

11 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం

జిల్లాలోని 449 ఎంపీటీసీ స్థానాల్లో కేవలం 11 స్థానాలు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిని 438 చోట్ల వివిధ పార్టీల తరఫున, స్వతంత్రంగా పోటీచేస్తున్నారు.

27 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీ

టీడీపీ–22, జనసేన–5,

కాంగ్రెస్‌–21, సీపీఐ, బీజేపీ, ఎస్‌ఎస్పీ ఒక్కో స్థానంలో పోటీ

స్వతంత్రులు పోటీచేస్తున్న స్థానాలు – 23

14 జెడ్పీటీసీ స్థానాల్లో ముగ్గురు చొప్పున పోటీ

జామి, పూసపాటిరేగ స్థానాల్లో

ఏడుగురు చొప్పున..

గంట్యాడ జెడ్పీటీసీ స్థానానికి

వైఎస్సార్‌సీపీ–టీడీపీ మధ్య పోటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement