పూసపాటిరేగలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి హైడ్రామా | - | Sakshi
Sakshi News home page

పూసపాటిరేగలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి హైడ్రామా

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

పూసపాటిరేగ: పూసపాటిరేగ మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు బీ ఫారాలు జారీ, అభ్యర్థులు జాబితా ప్రకటన విషయంలో గందరగోళం నెలకొంది. రిటర్నింగ్‌ అధికారికి నిర్ణీత సమయంలో వచ్చిన 41 బిఫారాలకుగాను, గంటల వ్యవధిలో టీడీపీకి అనుకూలంగా పసపాం, కొప్పెర్ల, సిహెచ్‌.అగ్రహారం ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ బీ ఫారాలు ఇచ్చినట్లు రిటర్నింగు అధికారి ప్రకటించి హైడ్రామా నడిపారు. మండలంలో 21 ఎంపీటీసీలకుగాను విత్‌డ్రా సమయంలో వైఎస్సార్‌సీపీ నుంచి 21 బీ ఫారాలు, టీడీపీ నుంచి 9 బీ ఫారాలు, జనసేన 9, బీజేపీ 2 బీ ఫారాలు ఇచ్చినట్లు ప్రకటించారు. రాత్రి 7 గంటల సమయంలో జాబితా వెల్లడించే సమయానికి టీడీపీ పార్టీకి మరో 3 బీ ఫారాలు కలుపుతూ రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు పూసపాటిరేగ మండల పరిషత్‌ కార్యాలయం గేటు వద్ద నిరసనకు దిగారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు మహంతి శ్రీనివాసరావు బీ ఫారాలలో తేడా రావడంతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి గోపిని ప్రశ్నించారు. నిర్ణీత సమయానికి వున్న బీ ఫారాలు తప్ప అదనంగా బీ ఫారాలు వుంటే సహించేది లేదని, అధికార పార్టీ ఒత్తడితోనే రిటర్నింగ్‌ అధికారి తప్పుడు పనికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 7 గంటల సమయంలో రిటర్నింగ్‌ అధికారి టీడీపీ నుంచి బీ ఫారాలు తీసుకొని కొప్పెర్ల, సిహెచ్‌.అగ్రహారం, పసపాం సిగ్మెంటులకు కలపడంపై భారీగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండల పరిషత్‌ కార్యాలయానికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఆర్‌ఓ తీరుపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని, అధికార పక్షానికి కొమ్ముకాసిన ఉద్యోగులను వదిలేది లేదని న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. వారితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

9 నుంచి 12కి పెరిగిన టీడీపీ

బీ ఫారాలు

రాత్రి 7 గంటల సమయంలో

బీ ఫారాలు ఇచ్చినట్లు ఆరోపణలు

ఆర్‌ఓ తీరుపై మండిపడిన

వైఎస్సార్‌సీపీ శ్రేణులు

ఆర్‌ఓపై చర్యలకు వైఎస్సార్‌సీపీ డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement