● జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం
● అప్రమత్తంగా ఉండాలని
అధికారులకు కలెక్టర్ ఆదేశం
● కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
తుపాను సహాయక చర్యల కోసం
ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నంబర్లు:
కలెక్టరేట్: 08922–236947
ఆర్డీఓ కార్యాలయం, విజయనగరం:
79970 81549
ఆర్డీఓ కార్యాలయం, బొబ్బిలి:
81796 24212
ఆర్డీఓ కార్యాలయం, చీపురుపల్లి:
97016 41979
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్:
98499 06486
బొబ్బిలి మున్సిపాలిటీ: 99496 61120
రాజాం మున్సిపాలిటీ: 08941–251060
నెల్లిమర్ల మున్సిపాలిటీ: 08922–44248
విజయనగరం గంటస్తంభం: అర్నాబ్ తుపాను దూసుకొస్తోందని, దీని ప్రభావంతో జిల్లాలో మంగళవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. తుపాను ముందస్తు జాగ్రత్త చర్య లపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అర్నాబ్ తుపాను కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందని, దీని ప్రభావంతో 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన పక్షంలో వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. వంగర, రేగిడి, సంతకవిటి తదితర నదీపరివాహక ప్రాంతాలు, 11 మత్స్యకార గ్రామాల్లోని సిబ్బంది అప్రమత్తం కావాలన్నారు. జిల్లా కేంద్రం, డివిజన్ కేంద్రాలతో పాటు మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసిన ట్టు వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఆర్డీఓలు సుధాసాగర్, సుధారాణి, రామ్మోహనరావు, జిల్లా విపత్తు నిర్వహణాధికారి డాక్టర్ అంబరీష్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
విద్యాలయాలకు సెలవులు
విజయనగరం అర్బన్: ‘అర్నాబ్’ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో అని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈఓలు), ప్రధానోపాధ్యాయులు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎంఈఓ కార్యాలయాలు యథావిధిగా పనిచేయాలని స్పష్టం చేశారు.


