నగర అభివృద్ధి మా బాధ్యత | - | Sakshi
Sakshi News home page

నగర అభివృద్ధి మా బాధ్యత

Oct 27 2026 1:02 AM | Updated on Oct 27 2026 1:02 AM

● మన ఇంటి ఆడపిల్లగా మేయర్‌ అభ్యర్థి శ్రావణిని ఆశీర్వదించండి

● 62 మంది కార్పొరేటర్‌ అభ్యర్థులను గెలిపించండి

● శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ

విజయనగరం: తన సొంత ప్రాంతమైన విజయనగరం అభివృద్ధి, నగరంలో నివసిస్తున్న ప్రజల శ్రేయస్సు తనతో పాటు, మాజీ డిప్యూటీస్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామిల బాధ్యత అని ఏపీ శాసనమండలి విపక్షనేత బొత్స సత్య నారాయణ ఉద్ఘాటించారు. విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోలగట్ల శ్రావణితో పాటు 62 డివిజన్‌లలో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చే స్తున్న అభ్యర్థులను ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నగరంలోని 31, 32, 33, 41 డివిజన్‌లకు సంబంధించి తోటపాలెం బాలాజీ నగర్‌లోను, 42, 43, 44వ డివిజన్‌లకు సంబంధించి వి.టి.అగ్రహారంలోను, 58, 59, 60, 61, 62 డివిజన్‌లకు సంబంధించి గాజులరేగ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమ వారం సాయంత్రం ప్రచార సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ప్రస్తుత కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేసుకోవాలన్నారు. కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కార్పొరేషన్‌ పాలకవర్గం విజయనగరం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందన్నారు. దుర్మార్గ పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పే సమయం ఇదేనని, ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. మరోసారి కూటమి పాలకుల మాటలకు మోసపోయి ఓట్లు వేయవద్దని అభ్యర్థించారు. సమావేశంలో మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామితో పాటు, వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి కోలగట్ల శ్రావణి, ఆయా డివిజన్ల అభ్యర్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement