గరుగుబిల్లి: మండలంలోని పెదగుడబ పంచాయతీ పరిధి ఎస్ఆర్ పేట, పెదగుడబ గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కూడిన 15 కుటుంబాలు వైఎస్సార్సీపీలో ఆదివారం చేరాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పుష్పశ్రీవాణి పార్టీ కండువాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సీనియర్ నాయుకులు కర్రి కోటేశ్వరరావు, ఎం.సింహచలం నాయడు, పి.తిరుపతిరావు (మిలటరీ నాయుడు), ఎ.శేఖర్, కందిశ అఖిల్, ఎస్.వెంకటరమణ తదితరులు ఉన్నారు. పెదగుడబ పంచాయతీ పరిధిలోని రెండు గ్రామాలనుంచి 15 కుటుంబాలు పార్టీ మారడం స్థానికంగా రాజకీయ చర్చకు దారితీసింది. త్వరలో జరగనున్న ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మరిశర్ల బాపూజీనాయుడు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కేతిరెడ్డి అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.


