బొబ్బిలి మండలంలో 50 కుటుంబాలు.. | - | Sakshi
Sakshi News home page

బొబ్బిలి మండలంలో 50 కుటుంబాలు..

Oct 26 2026 7:48 AM | Updated on Oct 26 2026 7:48 AM

బొబ్బిలి: వెన్నుపోటు టీడీపీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక పాలనకు విసుగెత్తి ఆ పార్టీకి రాంరాం చెప్పారు బొబ్బిలి మండలంలోని జగన్నాథ పురం వాసులు. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జగన్నాథ పురానికి చెందిన 50 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కండువాలు వేసి వైఎస్సార్‌సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శంబంగి మాట్లాడుతూ కూటమి నాయకులు,వెన్నుపోటు ప్రభుత్వం ఎన్నో ప్రగల్భాలు పలికి దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ఆ తరువాత హామీలను తుంగలో తొక్కారన్నారు. మహిళలకు,రైతులకు,యువతకు వెన్నుపోటు పొడిచారన్నారు. హామీలను విస్మరించిన చంద్రబాబు నాయుడు, లోకేష్‌, పవన్‌కల్యాణ్‌లకు ఉద్వాసన పలికే రోజులు రానున్నాయన్నారు. తాజామాజీ ఎంపీటీసీ రౌతు తిరుపతిరావు, డీసీఎంఎస్‌ మాజీ డైరక్టర్‌ పొట్నూరు అప్పారావు, తాడ్డి పైడియ్య,సంగంరెడ్డి తవిటినాయుడు, సారిక అప్పారావు, మామిడి చిరంజీవి తదితరులు మాట్లాడుతూ హామీలిచ్చి అమలు చేయని టీడీపీ పట్ల విర క్తి చెంది వైఎస్సార్‌ సీపీలో చేరామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, జడ్పీటీసీ అభ్యర్థి శంబంగి వేణుగోపాల నాయుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి బొద్దల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement