తీరంలో తుఫాన్‌ అలర్ట్‌ | - | Sakshi
Sakshi News home page

తీరంలో తుఫాన్‌ అలర్ట్‌

Oct 26 2026 7:48 AM | Updated on Oct 26 2026 7:48 AM

తీరంలో తుఫాన్‌ అలర్ట్‌

● పడవలు, వలలలు సురక్షిత ప్రాంతాకు తరలించండి

● పూసపాటిరేగ, భోగాపురం తహసీల్దార్‌ల ఆదేశాలు

పూసపాటిరేగ: తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో తీరంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని పూసపాటిరేగ, భోగాపురం తహసీల్దార్‌లు ఎన్‌వీ రమణ, రమేష్‌లు ఆదేశాలు జారీ చేశారు. తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురంలలో గ్రామాలు చింతపల్లి, నీలగెడ్డపేట, బర్రిపేట, పతివాడబర్రిపేట, తమ్మయ్యపాలెం, పులిగెడ్డపేట, తిప్పలవలస, కోనాడ, చేపలుకంచేరు, ముక్కాం, కొండ్రాజుపాలెం గ్రామాలకు చెందిర మత్స్యకారులు తుఫాన్‌ప్రభావం కారణంగా వేటకు వెళ్లవద్దు అని ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నం సమీపంలో తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉడడంతో బలమైన గాలులు వాయగుండంతో పాటు భారీ వర్షాలు పడతాయన్నారు. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు తమ విలువైన పడవలు, వలలు, ఇతర సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తుఫాన్‌ హెచ్చరికలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో దండోరా వేయించినట్లు తెలిపారు. అధికారులు, గ్రామస్థాయి సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. తుఫాన్‌ ప్రభావంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున పాత భవనాల్లో నివసిస్తున్న కుటుంబాలు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండడం ప్రమాదకరమని, వర్షాలు, గాలులు సమయంలో చెట్ల కింద, విద్యుత్‌ స్తంభాల సమీపంలో ఉండకూడదని హెచ్చరించారు. ప్రధానంగా సముద్ర తీర గ్రామాల ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనసరిగా పాటించాలని తహసీల్దార్‌లు కోరారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే అధికారులకు సమాచారం అందించి ప్రాణ రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement