సాలూరు రూరల్: స్థానిక మున్సిపాలిటీలోని 5 వ వార్డు పెద్దవీధినుంచి 38 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో ఆదివారం చేరారు. మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు పుండరీ కాక్షనాయుడు వారందరికీ కండువాలు వేసి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ వారి కష్ట సుఖాల్లో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దేవుడికి ఇచ్చిన వాగ్దానం మంత్రి సంధ్యారాణి నిలబెట్టుకోలేకపోవడం బాధాకరమన్నారు. ఎల్ల మ్మ గుడి కట్టించడం మంత్రి స్థాయిలో ఉన్న ఆమెకు కష్టమేమీ కాదని, స్థానిక ప్రజలకు ఇష్ట దైవమైన ఎల్లమ్మ గుడి కట్టిస్తానని మాట ఇచ్చిన సంధ్యారాణి ఆ మాటను నిలబెట్టుకోలేక పోయారన్నారు. మీ అందరి ఆశీర్వచనాల వల్ల మున్సిపల్ చైర్పర్సన్ వైఎస్సార్సీపీ గెలిచి అలాగే జగన్ మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచిన తరువాత ఎల్ల మ్మతల్లి గుడిని నిర్మాణం చేస్తానని మాట ఇస్తున్నానన్నారు.


