డీఎంహెచ్‌ఓకు అవమానం..! | - | Sakshi
Sakshi News home page

డీఎంహెచ్‌ఓకు అవమానం..!

Oct 7 2026 1:52 AM | Updated on Oct 7 2026 1:52 AM

● విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ ప్రారంభ శిలాఫలకంపై ఆమె పేరు రాయని వైనం

విజయనగరం ఫోర్ట్‌: వైద్య ఆరోగ్యశాఖకు చెందిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల ప్రారంభోత్సవ శిలాఫలకాలపై డీఎంహెచ్‌ఓ ఎస్‌.జీవనరాణి పేరు రాయకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సంబంధిత అధి కారులను ఆమె ప్రశ్నించినట్టు తెలిసింది. జిల్లా లోని చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాల్లోని జగన్నాథపురం, పల్లిగండ్రేడు, అంబటివలస, ఏనుగులవలస, సారిపల్లి, కొండశంబాం గ్రామాల్లో నిర్మించిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వర్చువల్‌ విధానంలో మంగళవారం ప్రారంభించారు. ఆరు శిలాఫలాకాల్లోనూ డీఎంహెచ్‌ఓ పేరు లేక పోవడం గమనార్హం. దీంతో కార్యక్రమానికి హాజరైన అధికారులంతా ఇదే అంశంపై గుసగుసలాడారు. ఇదేవిషయాన్ని డీఎంహెచ్‌ఓ జీవనరాణి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా శిలాఫలకాలపై పేరు లేక పోవడం వాస్తవమేనన్నారు. తర్వాత దశలో పేరు యాడ్‌ చేస్తామని అధికారులు చెప్పారన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ దేవిమాధవి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అల్లు పద్మజ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

కొత్తవలసకు వచ్చిన ఇరుముడి డైరెక్టర్‌

కొత్తవలస: సినీహీరో రవితేజ కథానాయుకుడిగా నటించిన ఇరుముడి సినిమా డైరెక్టర్‌ శివనిర్వాణా కొత్తవవలస మండల కేంద్రంలో మంగళవారం సందడి చేశారు. కొత్తవలస పాత రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఆయన మామ యడ్ల వెంకటరమణ ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న అభిమానులు ఆయనతో మాట్లాడేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగపబడ్డారు. వైఎస్సార్‌ సీసీ నాయకులు బొంతల వెంకటరమణతో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం శివనిర్వాణా మాట్లాడుతూ ఇష్టదైవమైన అయ్యప్పస్వామి ప్రధాన పాత్రగా సినిమా తీసినట్లు తెలిపారు. స్వామిదయ, ప్రేక్షకుల ఆదరణతో రూ.3 వందల కోట్లకు పైబడి కలెక్షన్లు వచ్చినట్టు తెలిపారు. ఓటీటీలోనూ నంబర్‌–1 సినిమాగా నిలిచిందన్నారు.

పాస్‌పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి

● జేసీ సేతుమాధవన్‌

విజయనగరం గంటస్తంభం: రైతులకు నిర్దేశిత గడువులోగా పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేయాలని జేసీ ఎస్‌.సేతుమాధవన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి ఆయన ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంగళవారం మాట్లాడారు. అక్టోబర్‌, నవంబర్‌ నెలల పాస్‌పుస్తకాల పంపిణీ, భూముల రీసర్వే, 22ఏ దరఖాస్తుల పరిష్కారం, మాన్యువల్‌ రికార్డుల డిజిటలైజేషన్‌, పీజీఆర్‌ఎస్‌ వినతులపై సమీక్షించారు. అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement