గుర్ల: ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 22 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యుల పేరున ఆన్‌లైన్‌చేసి.. వన్‌బీ జారీ చేసిన ఘటన గుర్ల మండలం పాలవలసలో కలకలం రేపుతోంది. గ్రామస్తుల్లో వివాదానికి దారి తీసింది. రెవెన్యూ అధికారుల పని తీరును ఆక్షేపిస్తోంది. పాలవలసకు చెందిన టీడీపీ నాయకుడు గేదేల అప్పలనాయుడు తల్లి గేదేల సరస్వతి పేరున సుమారుగా 22 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆన్‌లైన్ చేశారు. కొంతమంది రైతులకు చెందిన రెండు ఎకరాల భూమిని కూడా ఆన్‌లైన్ చేసినట్లు పాలవలస రైతులు చెబుతున్నారు. సాధారణ రైతులు అన్ని పత్రాలు ఉన్నప్పటికీ తమ పేరిట భూములు ఆన్‌లైన్ చేసేందుకు వెనుకంజవేసే రెవెన్యూ అధికారులు... అధికార పార్టీకి చెందిన కుటుంబ సభ్యుల పేరున ప్రభుత్వ భూమిని నమోదుచేయడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ భూమిని ఎలా ఆన్‌లైన్ చేస్తారని స్థానిక టీడీపీ నాయకులే రెవెన్యూ అధికారులను నిలదీయడంతో పాటు ఎమ్మెల్యే కళా వెంకటరావు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, దీని వెనుక అధికార పార్టీకి చెందిన బడానేత హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
● అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడికి సెంటు భూమి లేకపోయినా ఆయన భార్య పేరిట 1.80 ఎకరాల భూమిని ఆన్‌లైన్ చేశారు. దీనికి సంబంధించిన వన్‌బీ ఆధారంగా ఆ నాయకుడు బ్యాంకులో పంట రుణం తీసుకున్నట్టు రైతులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని గుర్ల తహసీల్దార్ ఆదిలక్ష్మి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా పాలవలసలో ప్రభుత్వ భూమి ఆ గ్రామ నోషనల్ ఖాతాలో ఉన్నప్పటికీ వ్యక్తి పేరిట వచ్చింది. టెక్నికల్
టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యుల
పేరున ప్రభుత్వ భూమి
22 ఎకరాల ప్రభుత్వ భూమిటీడీపీ నేత పేరున ఆన్‌లైన్
రెవెన్యూ అధికారుల తీరుపై పాలవలస రైతుల ఆగ్రహం
సమస్య వల్ల ఇలా జరిగింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.


