హక్కులు అడిగితే అక్రమ కేసులా? | - | Sakshi
Sakshi News home page

హక్కులు అడిగితే అక్రమ కేసులా?

Oct 1 2026 12:47 AM | Updated on Oct 1 2026 12:47 AM

హక్కులు అడిగితే అక్రమ కేసులా?

మహిళల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన అమానుషం

సెప్టెంబర్‌ 27న విజయవాడ ధర్నా చౌక్‌లో మహిళలని కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ వ్యాన్లలోకి నెట్టారు. సచివాలయాల్లో అత్యధికంగా మహిళలే పనిచేస్తున్నారు. మీడియాలోనూ, ఇతరులు నోటితో చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషించడం దారుణం. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా సమయంలో ముందుండి సేవలదించిన తమ పట్ల ప్రభుత్వం, అధికారులు కక్షపూరితంగా వ్యవహరించడం తగదు.

– సీహెచ్‌.రమాదేవి, ఎస్జీఎస్‌డబ్ల్యూ ఐక్యవేదిక జిల్లా మహిళా ప్రతినిధి

టీవీ5 సాంబశివరావు బహిరంగ క్షమాపణ చెప్పాలి

టీవీ5 సాంబశివరావు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఏదో పొరపాటున నోరుజారానని విత్‌డ్రా అని ఊరుకుంటే సరిపోదని, రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులకు ఆయన తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన నాయకులపై పెట్టిన సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలన్నారు. గతంలో విద్యా వలంటీర్లకు జీవో 69 ద్వారా, ఉపాధ్యాయులకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇచ్చారని, సచివాలయ ఉద్యోగులకు ఇవ్వడానికి నిబంధనలు లేవనడం సరికాదన్నారు. తాము కోరుతున్న ఏఏస్‌, నోషనల్‌ ఇంక్రిమెంట్ల వల్ల ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.2వేల లోపు మాత్రమే భారం పడుతుందని స్పష్టం చేశారు. సర్వీస్‌ రూల్స్‌, ప్రమోషన్లు కల్పించాలని, మరణించిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు వర్తింపజేయాలని కోరారు.

– బి.శ ంకరరావు, ఎస్జీఎస్‌డబ్ల్యూ ఐక్యవేదిక జిల్లా ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement