గృహ సర్వే లోపాలు సరిదిద్దండి | - | Sakshi
Sakshi News home page

గృహ సర్వే లోపాలు సరిదిద్దండి

Sep 30 2026 1:58 AM | Updated on Sep 30 2026 1:58 AM

గృహ సర్వే లోపాలు సరిదిద్దండి

విజయనగరం గంటస్తంభం: హౌస్‌హోల్డ్‌ సర్వే వివరాల నమోదులో ఎన్యూమరేటర్లు, అధికారులు తీవ్ర అలసత్వం వహించడంపై కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన రెవెన్యూ అధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, విద్యుత్‌, బస్సు సౌకర్యాలు మెరుగుపడినప్పటికీ, సర్వే లాగిన్‌లో తప్పుగా నమోదు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. బాధ్యులైన వీఆర్‌వోలు, విలేజ్‌ సర్వేయర్లకు షోకాజ్‌ నోటీసులు, చార్జ్‌ మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 27 మండలాలు, 4 మున్సిపాలిటీల్లో 6,158 వ్యత్యాసాలు రాగా, ఇప్పటివరకు 2,193 మాత్రమే పరిష్కారయ్యాయని తెలిపారు. అక్టోబర్‌ 4వ తేదీ లోగా మిగిలిన అన్ని సవరణలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు పరిశీలించిన అనంతరమే అప్రూవల్‌ ఇవ్వాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్‌, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement