విజయనగరం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 37వ ఏపీ స్టేట్ కిక్ బాక్సింగ్ చాంపియన్‌న్‌షిప్‌లో విజయనగరం జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలను సాధించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో తమ ప్రతిభను చాటి జిల్లా కీర్తిని ఇనుమడింపజేశారు. పతకాలు సాధించిన క్రీడాకారుల్లో కె. లలితాదిత్య 21 కేజీల విభాగంలో కాంస్య పతకం, ఎం.ఎసిక 33 కేజీల విభాగంలో వెండి పతకం, జి. కాత్యాయని– 35 కేజీల విభాగంలో కాంస్య పతకం, డి. మాధవ్–52 కేజీల విభాగంలో వెండిపతకం, కె.ఆదర్శ్–74 కేజీల విభాగంలో వెండి పతకం, హర్షిణి వర్మ – 30 కేజీల విభాగంలో వెండి పతకం దక్కించుకున్నారు. ఈ క్రీడాకారులకు కోచ్ కె. మోహిత్ ఆధ్వర్యంలో శిక్షణ అందించారు. రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ చాంషియన్‌షిప్‌లో పతకాలు సాధించి విజయనగరం జిల్లాకు పేరు తీసుకువచ్చిన క్రీడాకారులను వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకుడు జి.ఈశ్వర్ కౌశిక్ అభినందించారు. క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా పేరును రాష్ట్ర, జాతీయస్థాయిలో నిలబెట్టాలని ఆయన అభిలషించారు.


