ఆర్చరీ విజేతలకు సత్కారం | - | Sakshi
Sakshi News home page

ఆర్చరీ విజేతలకు సత్కారం

Sep 30 2026 1:58 AM | Updated on Sep 30 2026 1:58 AM

ఆర్చరీ విజేతలకు సత్కారం

విజయనగరం రూరల్‌: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మూడో రోజైన మంగళవారం 50 మీటర్ల కాంపౌండ్‌ విభాగంలో మహిళలు పురుషులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎన్సీఎస్‌ ట్రస్టీలు నారాయణ శ్రీనివాస్‌, ప్రముఖ వ్యాపారి రవ్వ శ్రీనివాసరావులు ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

రామనారాయణాన్ని సందర్శించిన సినీ టీవీ నటుడు బాలాజీ

ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణన్ని టీవీ సినీ నటుడు బాలాజీ మంగళవారం సందర్శించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ప్రతినిధులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement