● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
● పీజీఆర్‌ఎస్‌కు 183 వినతులు
విజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యమని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహంచిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల నుంచి 183 వినతులు స్వీకరించారు. వాటిలో 78 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావ డం గమనార్హం. ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను ప్రత్యేకంగా సమీక్షించి ఎలాంటి జాప్యం లేకుంబా పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా రెవెన్యూ, భూ వివాదాలు, భూసర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అవసరమైన చోట అధికా రులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, ఫిర్యాదుదారుతో మాట్లాడిన అనంతరం మాత్రమే నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. అర్జీదారుతో మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికలో తప్పనిసరిగా నమో దు చేయాలన్నారు. పరిష్కరించిన వివరాలను ఫిర్యాదుదారులకు తెలియాజేయాలని సూచించా రు. 1100 టోల్‌ఫ్రీ ద్వారా వచ్చే వినతుల పరిష్కారంలోనూ జాప్యం ఉండకూడదని, ప్రజలు ఈ సేవలను వినియోగించుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
శాఖల పరంగా..వినతులు
రెవెన్యూ–78, పంచాయతీరాజ్–16, డీఆర్‌డీఏ–9, విద్యుత్–4, గృహ నిర్మాణం–1, గ్రామ సచివాలయం–9, విద్య–13, మున్సిపల్–6, డీఎంహెచ్‌వో–3, డీసీహెచ్‌ఎస్–1, ఇతర శాఖలు–43 వినతులు నమోదయ్యాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్వో సీహెచ్.సత్తిబాబు, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి ఇ.మురళి, జిల్లా స్పషల్ డిప్యూటీ కలెక్టర్లు అరుణకుమారి, వెంకటరెడ్డి, ఆర్డీవో లు సుధారాణి, సుధాసాగర్,జగన్నాథరావు, సీపీవో బాలజీ, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి, హౌసింగ్ పీడీ మురళీమోహన్,జిల్లా భూ సర్వే రికార్డ్స్ శాఖ సహాయ సంచాలకుడు ఆర్.విజయ్‌కుమార్, డీపీవో మల్లికార్జున్, డీఈఓ మణిక్యంనాయుడు,వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో దేవీప్రసాద్, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
బాధితుల న్యాయపరమైన సమస్యలకు
తక్షణమే పరిష్కారం
విజయనగరం టౌన్: బాధితుల న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ ఏఆర్.దామోదర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను విని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుంచి 25 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. భూతగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలకు సంబంధించి మూడు, మోసాలకు పాల్పడినట్లు మూడు, ఇతర అంశాలకు సంబంధించి 11 ఫిర్యాదులు అందాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలపై చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అడ్మిన్ ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.


