విజయనగరం రూరల్: కేంద్ర సమాచార, ప్రచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్ జర్నలిస్టుల బృందం జిల్లాలోని ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని సోమవారం సందర్శించింది. వర్సిటీ ఉపకులపతి టి.శ్రీనివాసన్, రిజిస్ట్రార్ జితేంద్రమోహన్ మిశ్రా, ఫైనాన్స్ అధికారి ఎం.శరత్‌చంద్రబాబు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక బృందంతో పాత్రికేయుల బృందం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. వర్సిటీ స్థాపన, లక్ష్యాలు, పనితీరు, విద్యార్థులకు అందిస్తున్న ఉన్నత విద్యావకాశాలు, ప్రాంతీయ ప్రజల అభ్యున్నతికి సంస్థ చేపడుతున్న విద్యా, పరిశోధనా పురోగతిని జర్నలిస్టులకు వీసీ వివరించారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్ జితేంద్రమోహన్ మిశ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న అకడమిక్, సహపాఠ్య కార్యక్రమాలు, విద్యార్థుల ప్రతిభ, సాధించిన విజయాలు, విశ్వవిద్యాలయ ప్రగతికి సంబంధించిన అంశాలను వివరించారు. కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ జర్నలిజం విభాగధిపతి డాక్టర్ ఇప్పిలి తారకేశ్వరరావు సమన్వయం చేశారు. సమావేశంలో ఫైనాన్స్ అధికారి శరత్‌చంద్రబాబు, లైబ్రేరియన్ శంకర్‌రెడ్డి, పరీక్షల అధికారి సురేష్‌బాబు, ఏఓ ఎన్‌వీఎస్ సూర్యనారాయణ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


