విపత్తు నిర్వహణ వ్యవస్థ పటిష్టం | - | Sakshi
Sakshi News home page

విపత్తు నిర్వహణ వ్యవస్థ పటిష్టం

Sep 29 2026 1:09 AM | Updated on Sep 29 2026 1:09 AM

● రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత

● ఐదు అగ్నిమాపక కేంద్రాలు ప్రారంభం

విజయనగరం టౌన్‌: అగ్నిమాపకశాఖలో పనిచేసే ఫైర్‌మెన్‌లకు అత్యాధునిక శిక్షణతో పాటు ఆధునిక పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పించి రాష్ట్రంలో విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్టు రాష్ట్ర హోం మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని ఆమె సోమవారం ప్రారంభించి, అక్కడ ఏర్పాటుచేసిన స్టాల్స్‌, అత్యాధునిక ఫైర్‌ పరికరాల పనితీరును పరిశీలించారు. పూసపాటిరేగ, బొబ్బిలి అగ్నిమాపక కేంద్రాలను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలలో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాలను ఇక్కడ నుంచే వర్చువల్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఏఐఆర్‌ఎఫ్‌ సిబ్బందితో సమన్వయం చేసుకుని, పనిచేసే విధంగా ఫైర్‌సిబ్బందికి ఆధునిక శిక్షణ ఇస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సంపూర్ణంగా వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ ముందువరసలో ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్ట ర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు ఆర్‌విఎస్‌కెకె.రంగారావు, లోకం నాగమాధవి, పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, అగ్నిమాపకశాఖ డిజీ పీవీ.రమణ, ఏడి జి.శ్రీనివాస్‌, జి ల్లా అగ్నిమాపకశాఖ అధికారి పీవీ.రాజేష్‌, ఎడిఎఫ్‌ఓ సోమేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement