మెంటాడ: ఆండ్ర రిజర్వాయరు కుడి కాలువ పరిధిలోని 2ఎల్ ఎడమ కాలువకు భారీ గండి పడడంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ నుంచి నీరు ఉధృతంగా బయటకు ప్రవహిస్తుండడంతో చుట్టుపక్కల ఉన్న వరి పంటలు నీట మునిగాయి. ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలువ కింద సుమారు 250 ఎకరాల ఆయకట్టు సాగు భూమి ఆధారపడి ఉంది. అధికారులు తక్షణమే స్పందించి పూడ్చివేత చర్యలు చేపట్టకపోతే గండి మరింత పెద్దదై తీవ్ర నష్టం వా టిల్లే సూచనలు కనిపిస్తున్నాయని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ఇరిగేషన్ అధికారులు వెంటనే మేల్కొని గండి పడిన ప్రాంతంలో మరమ్మతులు చే పట్టి తమ పంటలను కాపాడాలని కోరుతున్నారు.


