అక్టోబర్‌ 25, 26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 25, 26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

అక్టోబర్‌ 25, 26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు ● 11 వేదికల్లో ఘనంగా నిర్వహణ ● కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి

● 11 వేదికల్లో ఘనంగా నిర్వహణ ● కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి

విజయనగరం గంటస్తంభం: పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా అక్టోబర్‌ 25, 26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు – 2026 ను అత్యంత వైభంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. పట్ట ణంలోని 11 వేదికల్లో రెండు రోజుల పాటు సాంస్కృతిక, క్రీడా, సంగీత, సాహిత్య, జానపద కార్యక్రమాలతో పాటు ఫుడ్‌ ఫెస్టివల్‌, సైన్స్‌ ఫెయిర్‌, సర్కస్‌, ఎగ్జిబిషన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉత్సవాల సమన్వయ అధికారిగా జేసీ ఎస్‌.సేతుమాధవన్‌ వ్యవహరిస్తారని, ఒక్కో వేదికకు జిల్లా స్థాయి అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. పైడితల్లి ఆలయం వద్ద శోభాయాత్ర, చరిత్ర క బొంకులదిబ్బ వద్ద ప్రారంభోత్సవం, అయోధ్య మైదానంలో మెగా మ్యూజికల్‌ నైట్‌, పెట్‌ షో, కోటలో లేబర్‌ షో, ఫొటో ఎగ్జిబిషన్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు. ప్రజలకు తాగునీరు, పారిశుధ్యం, వైద్యం, భద్రత తదితర సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement