బైక్‌ ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ ప్రమాదంలో ఒకరి మృతి

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

● మరో ఇద్దరికి గాయాలు

పాచిపెంట: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం..పెయింటింగ్‌ పనులు చేసుకుంటూ భార్య, ఇద్దరు చిన్నారులను పోషిస్తున్నాడు. రోజూ మాదిరిగానే వ్యక్తిగత పనిపై బయటకు వెళ్లి తిరిగి వస్తున్న ఆ వ్యక్తికి అదే చివరి ప్రయాణమైంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో భార్యాపిల్లలకు తీరని శోకం మిగిలింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పాచిపెంట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన బొబ్బిలి ఈశ్వరరావు (38) అలాగే తులసినాయుడు వీధికి చెందిన రౌతు రాజా, కేసలి గ్రామానికి చెందిన గాది తవిటిరాజు శనివారం వ్యక్తిగత పనుల నిమిత్తం రామభద్రపురం వెళ్లారు. పనులు ముగించుకుని రాత్రి సుమారు 10 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై పాచిపెంటకు వారు ముగ్గురూ తిరుగు ప్రయాణమయ్యారు. సాలూరు బైపాస్‌ రోడ్డులోని డంపింగ్‌ యార్డు సమీపంలో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న బొబ్బిలి ఈశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన రౌతు రాజాను స్థానికులు సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాది తవిటిరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. ఈశ్వరరావుకు భార్యతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. గతంలో వలంటీర్‌గా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం పెయింటింగ్‌ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి ఒక్కసారిగా దూరం కావడంతో భార్యాపిల్లలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. ఇంటిని నడిపే వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం..

రహదారి ప్రమాదంలో ఈశ్వరరావు మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఆదివారం ఉదయం సాలూరు ఏరియా ఆస్పత్రికి వెళ్లి మార్చురీలో ఉన్న మతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులతో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ అండగా ఉంటున్న ధైర్యం చెప్పారు.. ఈశ్వరరావు ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున మండల కేంద్రంలో బూత్‌ లెవెల్‌ ఏజెంట్‌ (బీఎల్‌ఏ)గా పనిచేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement