రేబిస్‌ను అంతం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

రేబిస్‌ను అంతం చేద్దాం

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

● వేపాడ పశువైద్యాధికారిణి

డా.గాయత్రి

● నేడు ప్రపంచ రేబిస్‌ నివారణ దినోత్సవం

వేపాడ: రేబిస్‌ వ్యాధి సోకిన జంతువుల కాటు, గీతల వల్ల వ్యాపించే ప్రాణాంతక వైరస్‌ రేబిస్‌ వ్యాధి. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి సోకిన జంతువుల లాలాజలంలో వైరస్‌ ఉంటుంది. వైరస్‌ సోకిన జంతువు కరవడం, గీరడం వల్ల మానవులకు, జంతువులకు వ్యాధి వ్యాపించే ప్రమాదముందని వేపాడ పశువైద్యాధికారిణి డా.గాయత్రి తెలిపారు. ప్రతి ఏటా సెప్టెంబర్‌ 28న వరల్డ్‌ రేబిస్‌ డే నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా వ్యాధి లక్షనాలు, నివారణపై అవగాహన కల్పిస్తున్నట్లు డాక్టర్‌ గాయత్రి తెలిపారు. రేబిస్‌ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడం, కుక్కలు ఇతర జంతువులకు సకాలంలో టీకాలు వేయించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. సాధారణంగా రేబిస్‌ వ్యాధి సోకిన కుక్కలు, పిల్లులు, ఇతర జంతువుల లాలాజలం ద్వారా, ముఖ్యంగా కాటు లేదా గీతల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. వ్యాధి లక్షణాలు ప్రారంభమైన తర్వాత రేబిస్‌ ప్రాణాంతకంగా మారుతుంది.

రేబిస్‌ లక్షణాలు ఇవే..

రేబిస్‌ వ్యాధి సోకితే ప్రారంభంలో ప్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. జ్వరం, అనారోగ్యంగా ఉంటుంది. జంతువు కాటు, గీరిన చోట తిమ్మిరి, జలదరించడం, ఆందోళన గందరగోళం, మతిమరుపు వంటి భ్రాంతులు కనిపించడం మింగడంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పక్షవాతం లాంటి లక్షణాలు ఉంటాయి.

వ్యాధి నివారణ ఇలా..

రేబిస్‌ సోకిన జంతువు కాటు వేసినా గీరినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రేబిస్‌ టీకాలు, ఇమ్యునోగ్లోబులిన్‌ ఇవ్వడం ద్వారా వ్యాధి నివారించవచ్చు. – డా.కోరాడ గాయత్రి

పశువైద్యాధికారిణి, వేపాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement