బ్రాయిలర్
లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్
శ్రీ140 శ్రీ266 శ్రీ276
చికెన్
పూసపాటిరేగ: సముద్రమే సర్వస్వంగా జీవిస్తున్న మత్స్యకారులను ప్రకృతి వైపరీత్యాలు కుంగదీస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు అనుకున్న విధంగా పడకపోయినా అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చి గాలులతో వేట సాగక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌తో వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో వేట సాగకపోయినా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. వేట లేని సమయంలో మత్స్యకారులను ఆదుకుంటామని చెబుతున్న ప్రభుత్వం తమను విస్మరించిందని పలువురు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేట లేని సమయంలో బియ్యం, నగదు సాయం చేయాలని కోరుతున్నారు.
జిల్లాలో తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురంలో 19 మత్స్యకార గ్రామాల్లో 20 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వారిలో వేటపై ప్రత్యక్షంగా 5 వేల మంది, పరోక్షంగా 15వేల మంది మత్స్యకారులు ఆధారపడి ఉన్నారు. పూసపాటిరేగ మండలంలో చింతపల్లి, నీలగెడ్డపేట, చింతపల్లి బర్రిపేట, చింతపల్లి పెద్దూరు, పతివాడ బర్రిపేట, తిప్పలవలస, తమ్మయ్యపాలెం, పులిగెడ్డ, కోనాడ, బొడ్డుగురయ్యపేట, బొడ్డు వెంకటేషుపేట, భోగాపురం మండలంలో చేపలకంచేరు, ముక్కాం, కొండ్రాజుపాలెం, చోడిపల్లిపేట, ఎర్రముసలయ్యపాలెం తదితర గ్రామాలున్నాయి. ఆయా గ్రామాల పరిధిలో మత్స్యకారులు వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రెండు మండలాల్లో 885 బోట్లు రిజిస్టర్ అయి ఉన్నాయి.
వేటలేని సమయంలో మత్స్యకారులను ఆదుకోవాలి
వేట లేని సమయంలో మత్స్యకారులను పభుత్వం ఆదుకోవాలి.ప్రకృతి వ్యపరీత్యాలు సంభవించినప్పుడు మత్స్యకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గడిచిన నాలుగు రోజులుగా తుఫాన్ ప్రభావంతో ఇబ్బంది పడ్డాం. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. వేట లేని సమయంలో బియ్యంతో పాటు నగదు అందించి మత్స్యకారులను ఆదుకోవాలి. – బర్రి చినఅప్పన్న, జిల్లా మత్స్యకార
సొసైటీ మాజీ అధ్యక్షుడు, విజయనగరం
ప్రతికూల వాతావరణంతో
జీవనోపాధికి గండి
ప్రభుత్వం నుంచి సాయం
అందక అవస్థలు
ఇబ్బంది పడుతున్న సుమారు
20 వేల మంది మత్స్యకారులు


