నాగావళిలో తగ్గిన నీటిమట్టం | - | Sakshi
Sakshi News home page

నాగావళిలో తగ్గిన నీటిమట్టం

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

పాలకొండ రూరల్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతోపాటు ఆర్నాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో నాగావళి నదిలో మూడు రోజులుగా వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. దీంతో మండలంలోని తీరప్రాంతం వెంబడిగల యరకారాయపురం, చిన మంగళాపురం, గొట్ట మంగళాపురం, గోపాలపురం, అన్నవరం, అంపిలి గ్రామాలతో పాటు పాలకొండ పట్టణంలో వడమ, ప్రధాన రహదారిలో కొంత భాగం నీటమునిగిన విషయం విదితమే. రెండు రోజలుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద నీరు నెమ్మదించింది. ఆదివారానికి నదిలో నీటి ప్రవాహ ఉధృతి సాధారణ స్థితికి చేరడంతో తీరప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరో రెండు రోజుల వరకూ అక్కడి పల్లెవాసులు, సమీప రైతులు నదీ సంబంధిత అవసరాలకు దూరంగా ఉండాలని రెవెన్యూ, పోలీస్‌, ఆగ్నిమాపక అధికారులు స్పష్టం చేస్తున్నారు.

పశువుల అక్రమ రవాణా అడ్డగింత

కురుపాం: అక్రమంగా వాహనంలో పశువులను తరలిస్తున్నట్లు తెలుసుకున్న సమాచారం కురుపాం ఎస్సై నారాయణరావు, సిబ్బంది మండల కేంద్రంలో ఆదివారం సబ్‌స్టేషన్‌ వద్ద తనిఖీలు చేపట్టి లగేజీ వాహనంలో ఆరు పశువులు తరలిస్తున్నట్లు గుర్తించి, వాహనాన్ని పశువులను స్వాధీనం చేసుకున్నారు. ఆ పశువులను భామిని గ్రామం నుంచి నవగాం గ్రామానికి వధ నిమిత్తం తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి పాలకొండ మండలం జంపరకోట పంచాయతీలోని బడ్డుమాసింగి గ్రామానికి చెందిన పొట్నూరు శంకరరావుపై కేసు నమోదు చేశారు.

22 పశువులు స్వాధీనం

సాలూరు రూరల్‌/సాలూరు: పట్టణ పరిధిలోని మామిడిపల్లి బస్టాండ్‌ వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 22 పశువులను పట్టణ పోలీసులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. దీనిపై సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం..ఐదు వాహనాల్లో పశువులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టి వాహనాలను పట్టుకున్నారు.

బీసీ రోడ్డులో వ్యక్తి మృతి

అక్కిరెడ్డిపాలెం(విశాఖ): గాజువాక బీసీ రోడ్డు నీటి ఏనుగు జంక్షన్‌ సమీపంలో సులభ్‌ కాంప్లెక్స్‌ వద్ద ఆదివారం రాత్రి లక్కోజు కృష్ట (50) అనే వ్యక్తి మృతి చెందాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలివి.. విజయనగరం జిల్లా మెంటాడకు చెందిన కృష్ణ గత ఐదేళ్లుగా నగరంలోని ఓ వితంతు మహిళతో సహజీవనం చేసేవాడు. సుమారు మూడు నెలల క్రితం ఆమె మృతి చెందడంతో, మనస్థాపానికి గురై తీవ్రంగా మద్యం సేవిస్తున్నట్లు ఉన్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సులభ్‌ కాంప్లెక్స్‌ వద్ద మృతి చెంది కనిపించగా, సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement