నవంబర్‌10న శ్రీమతి విజయనగరం పోటీలు | - | Sakshi
Sakshi News home page

నవంబర్‌10న శ్రీమతి విజయనగరం పోటీలు

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

విజయనగరం క్రైమ్‌: విజయనగరంలోని ఎస్వీఎన్‌ వేదికగా శ్రీమతి విజయనగరం పోటీలను నవంబర్‌ 10 న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు రాజు తెలిపారు. ఈ మేరకు స్థానిక అంబటి సత్రం ప్రెస్‌క్లబ్‌లో పద్మ హస్పిటల్‌ అఽధినేత డా.వెంకటేశ్వరరావుతో సంయుక్తంగా ఆయన ఆదివారం మాట్లాడారు. కళలకు పుట్టినిల్లు, సాంస్కృతిక రాజధాని అయిన విజయనగరంలో మగువల ప్రతిభను వెలికి తీసేందుకు తొలిసారిగా శ్రీమతి విజయనగరం పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 30 వ తేదీన ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నట్లు ఈవెంట్‌ మేనేజర్‌ రాజు తెలిపారు. సంప్రదాయ బద్ధంగా పాశ్చాత్య ధోరణికి అస్సలు తావు ఇవ్వకుండా చీర కట్టుతోనే ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల మహిళామణులు ఈ పోటీలలో పాల్గొనవచ్చని అక్టోబర్‌ 30వ తేదీన ఎస్వీఎన్‌ లేక్‌ ప్యాలెస్‌లో ఆడిషన్స్‌ జరుగుతాయని పేర్కొన్నారు. కళలకు కాణాచి అయిన విజయనగరంలో సీ్త్రలలో దాగి ఉన్న , ఉన్న ప్రతిభను ప్రపంచానికి తెలియ చెప్పేందుకే శ్రీమతి విజయనగరం పోటీలను నిర్వహిస్తున్నామని వెంకటపద్మ హాస్పిటల్‌ ఓనర్‌ డా.వెంకటరావు తెలిపారు. అదే రోజున మూడు లాంతర్లు జంక్షన్‌ వద్ద ఉన్న తమ హాస్పిటల్‌ అధునికీకరణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement