మడ్డువలసకు తగ్గిన ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

మడ్డువలసకు తగ్గిన ఇన్‌ఫ్లో

Sep 27 2026 1:28 AM | Updated on Sep 27 2026 1:28 AM

వంగర: మడ్డువలస ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 30వేల క్యూసెక్కుల నుంచి 20వేల క్యూసెక్కులకు తగ్గింది. ఆ మేరకు ప్రాజెక్టు నుంచి ఔట్‌ఫ్లో సైతం శనివారం 20వేల క్యూసెక్కులకు తగ్గినట్టు డీఈఈ పి.అర్జున్‌ తెలిపారు. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 64.45 మీటర్ల మేర నీరు నిల్వ ఉందన్నారు.

నేటి నుంచి అంతర్‌ జిల్లాల ఆర్చరీ పోటీలు

విజయనగరం రూరల్‌: ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం రామనారాయణంలో ఈ నెల 27 నుంచి 29 వరకు అంతర్‌ జిల్లాల ఆర్చరీ చాంపియన్‌ పోటీలు జరగనున్నట్టు ఎన్‌సీఎస్‌ చారిటబుల్‌ ట్రస్టీ నారాయణం శ్రీనివాస్‌ శనివారం తెలిపారు. ఏపీ ఆర్చరీ అసోసియేషన్‌, ఏపీ స్పోర్ట్స్‌ ఆథారిటీ, జిల్లా స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి, తదుపరి పోటీలకు ఎంపిక చేస్తారన్నారు. పోటీల ఆహ్వానప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

రేపు అండర్‌–19 చెస్‌ క్రీడాకారుల ఎంపిక పోటీలు

విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న స్కూల్‌ గేమ్స్‌ అండర్‌–19 చెస్‌ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలను ఈ నెల 28న నిర్వహించనున్నట్టు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శులు ఆర్‌.వాణిశ్రీ, బి.శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9 గంటలకు లక్కిడాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఎంపిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొనవచ్చని, జిల్లా స్థాయిలో ప్రతిభకనబరిచిన వారికి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు ఫిజికల్‌ డైరెక్టర్‌ జి.తవిటయ్య సెల్‌ నంబర్‌ 94925 90864ను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement