నెల్లిమర్ల: స్థానిక ఈవీఎం గోదాములను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. గోదాముల షట్టర్లకు వేసిన సీళ్లను, తాళాలను తెరిపించి, లోపలి గదులను పరిశీలించారు. పోలీసు బందోబస్తుపై సమీక్షించారు. సీసీ కెమెరాల ద్వారా చుట్టుప్రక్కల పరిస్థితులను పరిశీలించారు. అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులను, పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఆర్‌డీఓ సుధాసాగర్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ ప్రసాద్, ఇతర రెవెన్యూ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సముద్రపు రామారావు, అప్పికొండ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


