మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

Sep 26 2026 1:38 AM | Updated on Sep 26 2026 1:38 AM

మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

● అక్టోబర్‌ 1 వరకు గడువు.. 5న లాటరీ.

●సిండికేట్లకు చెక్‌.. : జిల్లా ఎకై ్సజ్‌ అధికారి కె.సహదేవ

పార్వతీపురం రూరల్‌ : జిల్లాలో పునరుద్ధరణకు నోచుకోని తొమ్మిది మద్యం దుకాణాలకు కలెక్టర్‌ ఆమోదంతో తాజా నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి సహదేవ తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని మొత్తం 56 దుకాణాలకుగాను 47 పాత లైసెన్సీలకే రెన్యువల్‌ కాగా, మిగిలిన 9 షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. సాలూరు మున్సిపాలిటీలో 3, పార్వతీపురం మున్సిపాలిటీలో 2, పాలకొండ రూరల్‌, సాలూరు రూరల్‌, పార్వతీపురం రూరల్‌, సీతానగరం మండలాల్లో ఒక్కో దుకాణం చొప్పున ఖాళీ ఉన్నాయన్నారు. ఔత్సాహికులు రూ.3 లక్షల దరఖాస్తు రుసుము, రూ.1000 ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి అక్టోబర్‌ 1లోగా ఆన్‌న్‌లైన్‌, ఆఫ్‌లైన్‌న్‌ లేదా హైబ్రిడ్‌ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఎవరైనా, ఎన్ని దుకాణాలకై నా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని, అక్టోబర్‌ 5న కలెక్టరేట్‌లో డ్రా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌ విధానం ద్వారా వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడే అవకాశం లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు. సాలూరు మున్సిపాలిటీలోని 3 దుకాణాలకు లైసెన్‌న్స్‌ ఫీజు రూ.60.50 లక్షలు, పర్మిట్‌ రూమ్‌ ఫీజు రూ.5 లక్షలు కాగా.. మిగిలిన ఆరు దుకాణాలకు లైసెన్స్‌ ఫీజు రూ.71.50 లక్షలు, పర్మిట్‌ రూమ్‌ ఫీజు రూ.7.50 లక్షలుగా నిర్ణయించారు. లాటరీలో ఎంపికై న వారు తొలి రోజే మొదటి వాయిదా చెల్లించాలన్నారు. ఎంఆర్పీకే మద్యం విక్రయించేలా దుకాణాల్లో స్కానర్లు, యూపీఐ యంత్రాలు తప్పనిసరి చేశామన్నారు. బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఈ నెలలో ఇప్పటికే 40 కేసులు నమోదు చేశామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో ఏఈఎస్‌ సంతోష్‌ కుమార్‌, సీఐలు వెంకటరాజు, నరసింహమూర్తి, శేఖర్‌ బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement