మధ్యవర్తిత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

మధ్యవర్తిత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

Sep 26 2026 1:38 AM | Updated on Sep 26 2026 1:38 AM

మధ్యవర్తిత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

విజయనగరం లీగల్‌: మధ్యవర్తిత్వాన్ని ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళ్లాలని, మధ్యవర్తిత్వ ప్రక్రియ చాలా సులువైనది, ఖర్చులేనిదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.బబిత అన్నారు. మధ్యవర్తిత్వంపై శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 90 రోజుల పాటు ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా మనోవర్తి కేసులు, ప్రమాద బీమా, గృహ హింస, చెక్‌ బౌన్స్‌ కేసులు సులువుగా ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చునన్నారు. అనంతరం మధ్యవర్తిత్వంపై ప్రజలలో అవగాహన పెంచడానికి జిల్లా కోర్టు ఆవరణలో ‘మధ్యవర్తిత్యం –దేశం కోసం‘ అనే స్టాల్‌ని ఏర్పాటు చేసి కక్షిదారులకు అవగాహన కల్పించారు. మధ్యవర్తిత్వం కోసం ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ దగ్గర స్టాల్‌ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్‌, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు బెల్లాన రవి, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement