విజయనగరం అర్బన్: మహరాజా అటానమస్ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) యూనిట్–2, యూనిట్–3 ప్రోగ్రాం అధికారులు సీహెచ్ చిన్నం నాయుడు, డాక్టర్ పీఎన్‌బీఆర్‌ఎస్‌ఎస్ శర్మలతో పాటు వలంటీర్లు టి.వేణు, పి.హర్షవర్ధన్, జి.కార్తీక్, పి.సాహిత్ ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ స్థాయి, జిల్లా స్థాయి ఉత్తమ ఎన్‌ఎస్‌ఎస్ అవార్డులను కై వసం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సాంబశివరావు తెలిపారు.
ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవం సందర్భంగా గురువారం ఆంధ్ర విద్యాలయంలో ఇటీవల నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఏయూ ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ డి.సింహాచలం, రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్ అధికారి డాక్టర్ సుధాకర్ చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందుకున్నారని తెలియజేశారు.


