చికెన్
మక్కువ: మండలంలోని నక్కల వీధికి చెందిన మర్రి పెద భాస్కరరావు(58) వెంగళరాయసాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. భాస్కరరావు ఈ నెల 23వ తేదీన సాయంత్రం డబ్బులు అవసరమని తన భార్య జయమ్మను అడిగి తీసుకొని ఇంటి నుంచి బయటకి వెళ్లి తిరికి ఇంటికి చేరుకోలేదు. భాస్కరరావుకు పిట్స్ ఉండటంతో, ఎక్కడైనా పడిపోయాడేమోనని గత మూడు రోజులుగా, ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. భాస్కరరావు మూకవలస వెళ్లే మార్గంలో ఒక పామాయిల్ తోటలో పని చేస్తుంటాడు. ఆ తోటకి వెళ్లే దారిలో వెంగళరాయసాగర్ కుడి కాలువలో శుక్రవారం విగతజీవుడిగా పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భార్య జయమ్మ సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎం.వెంకటరమణ తెలిపారు. పంచనామా జరిపించేందుకు సాలూరు ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


