చికిత్స పొందుతూ వ్యక్తి.. | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వ్యక్తి..

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

చికిత్స పొందుతూ వ్యక్తి..

గజపతినగరం రూరల్‌: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పాతబగ్గాం రైల్వేగేట్‌ సమీపంలో ఈ నెల 20న గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడ్డాడు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడ్ని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇతను రైలు నుంచి జారిపడడంతో ప్రమాదం జరిగిందా, లేక పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిందా.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. చికిత్స సమయంలో కూడా మాట్లాడలేకపోవడంతో అతని వివరాలు తెలియరాలేదని రైల్వే పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసినవారు 92475 85742, 83099 01038 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement