సాలూరు/మక్కువ: ఎన్ని ఇబ్బందులెదురైనా ప్రజల తరఫున నిలబడి సమస్యలపై పోరాటం చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సూచించారు. సాలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర.. పార్వతీపురం నియోజకవర్గ పరిశీలకుడు, మక్కువ జెడ్పీటీసీ సభ్యుడు మావుడి శ్రీనివాసరావు.. వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు మవుడి రంగునాయుడు తాడేపలిల్లో జగన్ మోహన్‌రెడ్డిని బుధవారం కలిశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షించారు. పాలకపక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా ముందుకు సాగాలని జగన్ మోహన్‌రెడ్డి సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అండగా నిలవాలన్నారు.


