పక్కాగా ఆపరేషన్‌ త్రిశూల్‌ | - | Sakshi
Sakshi News home page

పక్కాగా ఆపరేషన్‌ త్రిశూల్‌

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

పక్కాగా ఆపరేషన్‌ త్రిశూల్‌

● కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి,

ఎస్పీ మాధవ రెడ్డి

పార్వతీపురం: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ, ప్రజా భద్రత, రహదారి ప్రమాదాల నివారణ కోసం చేపడుతున్న ఆపరేషన్‌ త్రిశూల్‌ను పక్కాగా చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి, ఎస్పీ ఎస్‌వీ మాధవ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ఆపరేషన్‌ త్రిశూల్‌’ను ఫొటోలు, సమావేశాలకే పరిమితం చేయకుండా.. క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి రవాణా జరిగే 29 మార్గాలలో నిఘా, ర్యాండమ్‌ తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. 1908 టోల్‌ ఫ్రీ నంబర్‌పై విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు. అలాగే బాల్యవివాహల నియంత్రణ, మహిళా భద్రత, మెడికల్‌ షాపుల తనిఖీలు, రహదారి ప్రమాదాల నివారణకు ఆయా శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో విద్య, వైద్య, రవాణా, పోలీస్‌, ఎకై ్సజ్‌, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement